వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెంటికి చెడ్డారా: కెవిపిపై జగన్‌పార్టీ సురేఖ రివర్స్ అటాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao - Konda Surekha
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు రెంటికి చెడ్డారా అంటే అవుననే అంటున్నారు. గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఇడుపులపాయ వద్ద కెవిపిపై మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో గాంధీ భవనంలో పెట్టక పోవడంపై కెవిపి మాట్లాడటం తనకు కొంత బాధ, ఆశ్చర్యాన్నీ కలిగించిందని ఆమె అన్నారు.

వైయస్ కుటుంబాన్ని వేధించినప్పుడు కెవిపి ఎందుకు స్పందించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఒంటరిగా పోరాడుతుంటే కెవిపి ఏనాడు పలకరించలేదని విమర్శించారు. వైయస్‌ను అవినీతిపరుడు అని ఆరోపించినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదని, అప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకంలో తన ఫోటో పెట్టుకునే అర్హత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేదన్నారు.

కాగా వైయస్ ఫోటో లేకపోవడంపై కెవిపి రెండు రోజుల క్రితం గాంధీ భవనంలో అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెసులో తీవ్ర రగడకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనపై కాంగ్రెసు పార్టీ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. తులసి రెడ్డి, నిరంజన్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, మధుయాష్కీ, వి.హనుమంత రావులు కెవిపిపై మండిపడ్డారు. కెవిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టు అని వారు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

English summary
YSR Congress party leader, former minister Konda Surekha lashed out at Rajyasabha Member KVP Ramachandra Rao on Thursday. She has questioned Why KVP did not respond when Congress targetted YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X