హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిస్టులకు ప్రభుత్వ అవార్డులు: సురేంద్ర ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Journalist awards announced
హైదరాబాద్: పత్రికా రంగంలో అత్యంత ప్రతిభ కనబరచిన జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసే అవార్డులకు ఎంపికైన పాత్రికేయుల పేర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమీ అధ్యక్షులు తిరుమలగిరి సురేంద్ర వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వెలువడినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. పత్రికా రంగానికి చిరకాలం విశిష్ట సేవలు అందించిన వైతాళికులకు 'వి ఆర్ నార్ల జీవితకాల పురస్కారాలను' కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2008 , 2009 , 2010 సంవత్సరాలకు చెందిన ఈ అవార్డులను త్వరలో బహూకరిస్తారని ఆయన తెలిపారు. అవార్డు గ్రహీతలకు ప్రశంశా పత్రాలతోపాటు నగదు బహుమతిగా అందజేస్తారని సురేంద్ర పేర్కొన్నారు.

2008 సంవత్సరం : వి ఆర్ నార్ల లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ డా. తుర్లపాటి కుటుంబరావుకు ప్రకటించారు. బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును నందిరాజు రాధాకృష్ణకు, ఎం ఎ రహీం ఉత్తమ ఫోటోగ్రాఫర్ జర్నలిస్టు అవార్డును శ్రీధర్ నాయుడుకు , ఖాసా సుబ్బారావు ఉతమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును పి వి సత్యనారాయణ రావు కు, ఎం నర్సింగరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును వనం వెంకటేశ్వర్లుకు, షోబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును నరేందర్ పుల్లూర్ కు, ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును శ్రీమతి నాగ దుర్గా భవానికి, మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డును వేమూరి బలరాంకు, ఉత్తమ కార్టూనిస్టు అవార్డును ఎం వెంకటేశ్వరరావు (ఏమ్వీ)కు, అబీద్ ఆలీఖాన్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డును సయ్యద్ బాసిత్ మొహియుద్దీన్ కు, ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డును శ్రీమతి రెహనా బేగం కు, ఉత్తమ వీడియో గ్రాఫెర్ అవార్డును ఎస్ రమేష్ కు ప్రకటించారు.

2009 సంవత్సరం : వి ఆర్ నార్ల లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును పి వామనరావు కు, బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును సి ఆర్ గౌరీ శంకర్ కు, ఎం ఎ రహీం ఉత్తమ ఫోటోగ్రాఫర్ జర్నలిస్టు అవార్డును కే భాస్కర రావు కు, ఖాసా సుబ్బారావు ఉతమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును బోల్గం శ్రీనివాస్ కు, ఎం నర్సింగరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును గంజివరపు శ్రీనివాస్ కు, షోబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును ఏమినేని రవిచంద్ర కు, ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డును అర్జుమంద్ బానో కు, మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డును డోలేంద్ర ప్రసాద్ కు, (ఉత్తమ కార్టూనిస్టు అవార్డుకు ఎంట్రీలు రాలేదు), అబిద్ అలీ ఖాన్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టుకు రసియా నయీం హష్మికు, ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డును శ్రీమతి ఎం కవితకు, ఉత్తమ వీడియో గ్రాఫర్ అవార్డును వి వి శేషగిరి రావుకు, అమ్దజేస్తారు.

అదే మాదిరి 2010 సంవత్సరం వి ఆర్ నార్ల లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును డి సీతారాం కు, బి నాగేశ్వరరావు అవార్డును కే రమేష్ బాబుకు, ఎం ఎ రహీం ఉత్తమ ఫోటోగ్రాఫర్ జర్నలిస్టు అవార్డును టి శ్రీనివాస రెడ్డికి, ఖాసా సుబ్బారావు అవార్డును చినముని శేఖర్ కు, ఎం నరసింగరావు అవార్డును డి చంద్ర భాస్కరరావుకు, (షొబుల్లా ఖాన్ అవార్డును అర్హత కలిగిన ఎంట్రీలు రాలేదు) ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డును రత్న చోత్రానికి, మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డును బి జగన్మోహన్ రావుకు, (ఉత్తమ కార్టూనిస్టు అవార్డుకు అర్హత కలిగిన ఎంట్రీలు రాలేదు) అబిద్ ఆలీఖాన్ అవార్డును ఎం ఎ రహీం కు, ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డును దొంతు రమేష్ కు, ఉత్తమ వీడియో గ్రాఫర్ అవార్డును సి హెచ్ రంగా కు ప్రకటించినట్లు అకాడెమీ అధ్యక్షుడు సురేందర్ వెల్లడించారు.

English summary
Andhra Pradesh press akademi Chairman Tirumalagiri Surendra has announced journaliss awards for three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X