రాత పరీక్ష లేదు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు !!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిపుణులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులకు మార్గదర్శకంగా నిలిచే 8వ సెంట్రల్ పే కమిషన్ (8th CPC) లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం. ఎంపికైన అభ్యర్థులు నెలకు ₹90,000 నుంచి ₹1.80 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
8వ పే కమిషన్ ఎందుకు కీలకం?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాలు, పెన్షన్ వ్యవస్థలో మార్పులను పరిశీలించి కేంద్రానికి సిఫార్సులు చేయడమే 8వ పే కమిషన్ ప్రధాన లక్ష్యం. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల ఆదాయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ కమిషన్ పనితీరు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపనుంది. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లీగల్ రీసెర్చ్ వంటి విభాగాల్లో నిపుణులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు.

ఖాళీల వివరాలు..
సీనియర్ కన్సల్టెంట్ - 10 పోస్టులు
కన్సల్టెంట్ - 5 పోస్టులు
యంగ్ ప్రొఫెషనల్ - 10 పోస్టులు
వయోపరిమితి..
సీనియర్ కన్సల్టెంట్
కనీసం 10 ఏళ్ల అనుభవం
గరిష్ట వయసు: 45 సంవత్సరాలు
కన్సల్టెంట్
కనీసం 6 ఏళ్ల అనుభవం
గరిష్ట వయసు: 40 సంవత్సరాలు
యంగ్ ప్రొఫెషనల్
కనీసం 4 ఏళ్ల అనుభవం
గరిష్ట వయసు: 32 సంవత్సరాలు
అర్హతలు..
- ఫైనాన్స్, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్, పబ్లిక్ పాలసీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ
- ఎంబీఏ (Finance/HR)
- ఎల్‌ఎల్‌బీ లేదా న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య
- పే స్ట్రక్చర్, సర్వీస్ రూల్స్, పెన్షన్ వ్యవస్థ, ప్రభుత్వ పరిపాలన రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యం
సాంకేతిక నైపుణ్యాలు తప్పనిసరి..
MS Excel, Spreadsheet Analysis
PowerPoint Presentation
Data Interpretation & Reporting
Policy Analysis
Financial Modelling
Government Establishment Matters
Legal Research & Documentation
డేటా విశ్లేషణ, రిపోర్టుల తయారీలో అనుభవం ఉన్నవారికి అదనపు ప్రయోజనం ఉంటుంది.
వేతన వివరాలు..
పోస్టు - నెలవారీ వేతనం
- సీనియర్ కన్సల్టెంట్ - రూ.1,80,000
- కన్సల్టెంట్ - రూ.1,20,000
- యంగ్ ప్రొఫెషనల్ - రూ.90,000
పార్ట్‌టైమ్ అభ్యర్థులకు వారు పనిచేసిన రోజుల ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. అయితే DA, HRA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి అదనపు ప్రయోజనాలు ఉండవని కమిషన్ స్పష్టం చేసింది.
ఉద్యోగ బాధ్యతలు..
- కేంద్ర ఉద్యోగుల వేతన నిర్మాణాల విశ్లేషణ
- పెన్షన్ వ్యవస్థపై అధ్యయనం
- భత్యాల సమీక్ష
- అంతర్జాతీయ పే స్ట్రక్చర్లతో పోలికలు
- డేటా ఆధారిత విధాన నివేదికల తయారీ
- ప్రభుత్వానికి విధాన సిఫార్సులు రూపొందించడం
- చట్టపరమైన అంశాలపై పరిశోధన
- వ్యయ ప్రభావ అంచనాలు రూపొందించడం
ఎంపిక ప్రక్రియ..
- దరఖాస్తుల పరిశీలన
- అనుభవం, అర్హతల మూల్యాంకనం
- షార్ట్‌లిస్టింగ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- తుది ఎంపిక
సంబంధిత రంగాల్లో ఉన్న అనుభవం ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుంది.
దరఖాస్తు విధానం..
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
- 8వ సెంట్రల్ పే కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- విద్యార్హతలు, ఉద్యోగ అనుభవ వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- డిక్లరేషన్‌పై అంగీకారం తెలపాలి.
- ఫారమ్‌ను సమర్పించాలి.
- ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు.












Click it and Unblock the Notifications