రెచ్చగొట్టేందుకే తెలంగాణ ప్రకటన: కెసిఆర్‌పై కావూరి

మనోభావాల ఆధారంగా రాష్ట్రాలను విభజించదలుచుకుంటే ఉత్తరప్రదేశ్‌ను పది రాష్ట్రాలుగా విభజన చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో కొంతమంది నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన కోరుతున్నారని, విభజన కోరే ప్రాంతాల్లో ఆర్ధికంగాను, సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనుకబడి ఉంటే ప్రభుత్వాలు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం నీరుగారకుండా ఉండేందుకు 10 రోజుల్లో రాష్ట్ర విభజన జరుగుతుందని ప్రకటనలుచేసి ప్రజలను రెచ్చగొట్టి ఉనికిని కాపాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన పరోక్షంగా ఆ వ్యాఖ్య చేశారు. ఆగస్టులో లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఇటీవల పదే పదే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం దృష్ట్యా ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో డెల్టా సాగుకు వరుణదేవుని కరుణపైనే ఆధారపడి ఉందని కావూరి అన్నారు.












Click it and Unblock the Notifications