వైయస్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ, జగన్‌పై ఆవేదన

ఆడపడుచుల కోసం వైయస్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఏ ఆడపడుచూ వైయస్‌ను మర్చిపోరన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆడపడుచులు రాఖీలు కట్ట లేక పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జగన్ జైలు నుండి బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగా ఆయన కేబినెట్‌లోని మహిళా మంత్రులు తదితరులు రక్షా బందన్ రోజు ఆయనకు రాఖీ కట్టే వారు. మంత్రులు గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి, గల్లా అరుణ కుమారి, కొండా సురేఖ అందరూ ఆయనకు అన్నలా భావించి రాఖీ కట్టే వారు.












Click it and Unblock the Notifications