మలేషియాలో తెలుగు తేజం: ధాతుక్ అవార్డు

మలేషియా జాతీయుడైన డాక్టర్ అచ్చయ కుమార్ రావు మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యారు. గత ఆరేళ్లుగా మలేషియాలో నివసిస్తున్న తెలుగువారిని ఆయన సంఘటిత పరిచి, వారిలో తెలుగు భాషా సంస్కృతుల పట్ల అవగాహనను, చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
డాక్టర్ అచ్చయ్య కుమార్ రావు 1961 డిసెంబర్ 27వ తేదీన మలేషియాలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. స్త్రీ సంబంధం వ్యాధుల నిపుణుడిగా పేరు గడించారు.
డాక్టర్ అచ్చయ్య కుమార్ నిరుపమాన సేవలకు గుర్తింపుగా లభించిన మలేషియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన అవార్డు ధాతుక్ లభించడం పట్ల మలేషియాలోని ఐదు లక్షల మంది తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని, రాష్ట్రంలోని తెలుగు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications