జైపాల్ రెడ్డిపై నామా నాగేశ్వర రావు, అంబటి ఫైర్

ప్రభుత్వ అసమర్థత వల్లనే రత్నగిరికి గ్యాస్ తరలిపోతోందని ఆయన అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పి పుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రత్నగిరి గ్యాస్ కేటాయింపులన్నీ రాష్ట్ర ప్రతినిధులకు తెలిసే జరిగాయని, అందుకు రాష్ట్ర పార్లమెంటు సభ్యులందరూ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. విద్యుత్ కోతతో ప్రజలు అల్లాడుతుంటే కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని ఆయన విమర్శించారు.
మన రాష్ట్రానికి చెందిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలిస్తుంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోయిన జైపాల్ రెడ్డి తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
మంత్రుల సాధికారిక కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు మురళీదేవరా, షిండేలు గ్యాస్‌ను అక్రమంగా తరలించుకుపోతుంటే అదే కమిటీలో సభ్యుడిగా ఉన్న జైపాల్ రెడ్డి కళ్లు ఎందుకు మూసుకున్నారని ఆయన అడిగారు. జైపాల్ రెడ్డి తెలుగు ప్రజలకే కాకుండా దేశప్రజలకు కూడా సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తక్షణమే రత్నగిరి కేటాయింపులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జైపాల్ రెడ్డి సహా మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న నలుగురు కూడా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. గ్యాస్ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే తమ పార్టీ మహోద్యమం చేస్తుందని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications