పట్టుకోసం: ఎన్టీఆర్ స్కీంపై బాబు కన్ను, వైయస్‌పై ఫైర్

కొత్త విధానంతో బిసి విద్యార్థులపై భారం పడుతుందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సులోని 31వ సీలింగ్‌ను రద్దు చేయాలన్నారు. మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. బిసిలకు వంద స్థానాలలో టిక్కెట్లు ఇచ్చి గెలిపించి తీరుతామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేస్తామని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
చేనేత కార్మికుల భద్రతకు కనీస ఖర్చు కూడా ప్రభుత్వం చేయటం లేదన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో ప్రవేశ పెట్టిన జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్దరిస్తామని చెప్పారు. బిసిలకు తాము వంద సీట్లు ఇస్తామని చెప్పిన తర్వాత ఇతర పార్టీల వైఖరి మారిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ కోత వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బిసిల ఫీజు రీయింబర్సుమెంట్సుపై మంత్రి మండలి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే బిసి మంత్రులు ఏం చేస్తున్నారని తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. బిసిలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా ఆడుతున్నారని మండిపడ్డారు.
గ్యాస్ కేటాయింపుల్లో అన్యాయం... గాలి గ్యాస్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వేరుగా అన్నారు. తమ స్వలాభాల కోసం కాంగ్రెసు పెద్దలు రత్నగిరి పవర్ ప్లాంటుకు గ్యాస్ కేటాయింపులు చేశారని మండిపడ్డారు. రత్నగిరి పవర్ ప్లాంట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కాంగ్రెసు ముఖ్య నేతల బినామీ కంపెనీ అని ఆయన ఆరోపించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు మాట్లాడక పోవడం శోచనీయమని, వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications