పార్లమెంట్‌ను కుదిపిన అస్సాం ఘర్షణలు, అద్వానీ ఫైర్

హింసాకాండ చాలా దురదృష్టకరమన్నారు. అస్సాంలో జరిగినవి మతఘర్షణలు ఎంతమాత్రమూ కావననారు. అక్రమ వలసల వల్లే ఈ ఇబ్బందులు వచ్చాయన్నారు. హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్సించారు. అస్సాంలో ప్రస్తుతం పరిస్థితి అగ్ని పర్వతం పైన కూర్చున్నట్లుగా ఉందని అన్నారు. అంతకుముందు అద్వానీ అల్లర్లపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు.
విపక్షాల తీర్మానంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వివరణ ఇవ్వనున్నారు. అంతకుముందు సమావేశాల ప్రారంభానికి ముందు మన్మోహన్ మాట్లాడుతూ... విపక్షాలు లేవనెత్తే ఎలాంటి అంశం పైన అయినా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సభా నియమాల ప్రకారం చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశించారు. అస్సాం హింసపై రాజ్యసభలోనూ దుమారం రేగింది. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications