హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మతో సోనియా: బాబుకు శోభానాగిరెడ్డి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagireddy
హైదరాబాద్: తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినట్లుగా నిరూపిస్తే తాను, తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కరు రాజకీయాల నుండి తప్పుకుంటారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి బుధవారం సవాల్ చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్సుపై ప్రభుత్వ తాజా విధానాన్ని ఆమె తప్పు పట్టారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసేందుకు కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్నుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. వైయస్ పథకాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ ప్రజలు ఆయన్ని మర్చిపోయేలా చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు. ఫీజుల పథకాన్ని నీరుగార్చేందుకే మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు.. ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు అడిగారన్నారు.

ఇప్పుడు ఫీజు పథకంపై సిఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైయస్ కన్నా మేలైన విధంగా ఫీజుల పథకం అమలు చేస్తామన్నారు.. మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.31 వేలకు మించి చెల్లించబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని, పైగా మిగిలిన రూ.19 వేలు విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తారట అని అన్నారు. రైతులకు, కౌలుదారులకే అప్పులు ఇచ్చే దిక్కులేదని విమర్శించారు. వైయస్ చేపట్టిన ఫీజులు చెల్లింపు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల వల్ల సమాజంలో 50 శాతం ఉన్న బిసిలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారన్నారు.

వీటిని నీరుగార్చడంతో నష్టపోయేది ఆ వర్గాలే నష్టపోతాయన్నారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అందుకు టిడిపి సహకరిస్తోందని చెప్పారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు. ఫీజుల పథకాన్ని తానే ప్రవేశపెట్టానని చెప్పుకొంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఆయన హయాంలో బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.300 ముష్టిగా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ఉదహరించారని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వకుట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణ యంతో బయటపడిందని ఎమ్మెల్సీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు. వైయస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అండగా ఉద్యమాన్ని చేపడతామని జూపూడి తమ ప్రకటనలో హెచ్చరించారు.

English summary
YSR Congress party Allagadda MLA Sobha Nagi Reddy challenged Telugudesam party chief Nara Chandrababu Naidu that she will quit as MLA if it is proved that Vijayamma met AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X