షిర్డీ సాయిబాబా నిధుల గల్లంతుపై ఘర్షణ, ఉద్రిక్తత

ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసి పరస్పర దాడులకు దిగారు. దీంతో విచారణ ఆగిపోయింది. పోలీసులు భారీగా మోహరించారు. శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌లో భారీగా అక్రమాలు జరిగాయంటూ దేవాదాయశాఖకు ఫిర్యాదులందాయి. ఫిర్యాదులపై సోమవారం విచారణ జరపాలని నిర్ణయించుకుంది.
సాయిసంస్థాన్ ట్రస్ట్ నిధుల్లో రూ.10కోట్లు స్వాహా అయ్యాయని సంస్థాన్ మాజీ చైర్మన్ ఎస్.జయస్వామి దేవాదాయ ధర్మాధాయ శాఖ కమిషనర్‌కు జూన్‌లో ఫిర్యాదు చేశారు. సంస్థాన్ పేరుతో జరుగుతున్న నిధుల స్వాహాతో పాటు అనేక అక్రమాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఈమేరకు ఫిర్యాదు స్వీకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌లో జరుగుతున్న అక్రమాలు, నిధుల స్వాహపై విచారణకు ఆదేశించారు.
అసిస్టెంట్ కమిషనర్ ఎ.వి.రమణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. రమణమూర్తితో కూడిన బందం సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దిల్‌షుక్ నగర్‌లో షిర్డీ సాయిబాబా ఆలయం విశేషంగా భక్తుల ఆదరణ పొందింది. పెద్ద యెత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు.












Click it and Unblock the Notifications