ప్రజలు నమ్మారు, జగనే వచ్చేవాడు: వైయస్ విజయమ్మ

YS Vijayamma
ఏలూరు: తన కుమారుడు వైయస్ జగన్‌ను ప్రజలు నమ్మారని, వైయస్ రాజశేఖర రెడ్డికి వారసుడు వైయస్ జగన్ అని ప్రజలు ఇటీవలి ఉప ఎన్నికల్లో తిరుగులేని సమాధానం చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేపట్టిన దీక్షా శిబిరంలో ఆమె సోమవారం ప్రసంగించారు. అవకాశం ఉంటే వైయస్ జగనే ఇక్కడికి వచ్చి ఉండేవారని, జగన్ రాలేని స్థితిలో ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపడానికి వెళ్లాలని తనకు చెప్పాడని ఆమె అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పు పట్టారు.

మనసుంటే మార్గం ఉంటుందని, ప్రభుత్వ చర్య వల్ల ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఇప్పటి వరకు కౌన్సెలింగ్ కూడా జరగలేదని ఆమె అన్నారు. వైయస్ మరణం తర్వాత ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం ఏటా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆమె విమర్సించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్హులైనవారికే ఫీజు రీయంబర్స్‌మెంట్ వర్తింపజేస్తామని చెప్పారని, దాన్ని బట్టే ఆ పథకానికి తూట్లు పొడవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమైందని ఆమె అన్నారు.

పాతికేళ్లు ప్రజల మధ్య ఉండి ప్రజలకు ఏం చేయాలో వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించుకున్నారని, అందుకే ఒక కన్ను సంక్షేమంగా మరో కన్ను అభివృద్ధిగా రాష్ట్రాన్ని పాలించారని ఆమె అన్నారు. ఏ ప్రాంతానికి ఏం కావాలి, ఏ వర్గానికి ఏం కావాలనే అవగాహనతో వైయస్ పనిచేశారని ఆమె అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తూ ఫైలుపై తొలి సంతకం చేశారని ఆమె గుర్తు చేశారు. కరెంట్ బకాయిలు రద్దు చేశారని ఆమె చెప్పారు. సంక్షేమ పథకాలు మంచివి కావని అప్పుడు ప్రధాని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వంటి ప్రముఖులు చెప్పినా వైయస్ వెనక్కి తగ్గలేదని ఆమె అన్నారు.

ప్రజలకు కావాల్సిన విద్య, ఆరోగ్యం, వృత్తి, ఇల్లు, ఆహారంపై వైయస్ దృష్టి సారించారని ఆమె చెప్పారు. తన హయాంలో వైయస్ రాజశేఖర రెడ్డి 48 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించారని ఆమె చెప్పారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని ఆమె చెప్పారు. సంక్షేమాన్ని ఆ రకంగా ఐద రకాలుగా విభజించుకున్నారని ఆమె చెప్పారు. చెప్పింది మాత్రమే కాకుండా చెప్పనవి కూడా వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని ఆమె అన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆమె అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు.

వైయస్ జగన్ తన తండ్రిలా ఆలోలించారని, ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం వైయస్ జగన్ పలుమార్లు దీక్షలు చేపట్టారని, ప్రభుత్వంపై పోరాటం చేశారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉచిత విద్యుత్తు తీగెలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయని అన్నారని, అయితే వైయస్ రైతులకు ఏడు గంటలపాటు ఉచితంగా విద్యుత్తు ఇచ్చి చూపించారని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+