హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలుగు రోజులే చూస్తాం, లేకుంటే ఉగ్రరూపమే: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం నుంచి ప్రకటన కోసం నాలుగు రోజులు వేచి చూస్తామని, అప్పటి కూడా ప్రకటన రాకపోతే ఉగ్రరూపం దాలుస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. రాజేంద్ర నగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన టిఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామి గౌడ్ సన్మాన సభకు ఆయన మంగళవారం హాజరై ప్రసంగించారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. పత్తి పంట తెలంగాణలో 90 శాతం పండితే ఆంధ్రలో కాటన్ రిసెర్చీ సెంటర్లు ఎక్కువ ఉండడమేమిటని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి, గవర్నర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని, ప్రాంతీయ వివక్షే లేకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తెలంగాణవారిని విసిగా నియమించేవారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును మారుస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రపతి ఉత్తర్వులను సీమాంధ్ర అధికారులు తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. సీమాంధ్రకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు విత్తనాలను ప్రజలకు చేరవేయకుండా ప్రైవేట్ వ్యక్తులతో కుమ్ముక్కయి వారిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సీడ్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణవాదులకు ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు.

విలీనం తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో నాశనమైందని ఆయన అన్నారు. తదుపరి వ్యవసాయ విశ్వవిద్యాలం విసి పదవిని తెలంగాణవారికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దుకాణం నడపడానికి విశ్వవిద్యాలయాన్ని మూడు ముక్కలు చేశారని ఆయన విమర్శించారు. ఆ దఫా తెలంగాణ సాధించకపోతే సీమాంధ్రవాళ్లు బతకనీయరని ఆయన అన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏది ఏమైనా తెలంగాణ సాధించాల్సిందేనని, అంతిమంగా విజయం తమదేనని ఆయన అన్నారు.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao saif that he will wait for four days for union government positive statement on Telangana. If the statement will bot be delivered movement will be intensified, he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X