హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మాన రాజీనామా వద్దని సిఎం: పెద్దలపై ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Dharmana Prasad Rao
హైదరాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేయకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధర్మాన ప్రసాద రావుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేస్తే ఆ ప్రభావం మిగతా మంత్రులపై కూడా పడుతుందని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లి మంత్రి పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు ధర్మాన ప్రసాద రావును వాన్‌పిక్ కేసులో సిబిఐ నిందితుడిగా చేర్చింది. దీంతో తాను రాజీనామా చేస్తానని ధర్మాన అంటున్నారు.

సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ధర్మాన ప్రసాద రావు ఇంకా అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి పల్లంరాజును కలిశారు. అధిష్టానానికి చెందిన ఇతర పెద్దలను కూడా కలిశారు. ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాదుకు వచ్చి మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్నే ధర్మాన ప్రసాదరావు తన సన్నిహితులతో చెప్పారు. కానీ, ఢిల్లీలో పెద్దలను కలవడానికి ఢిల్లీలో మరింత సమయం ఉండాల్సి వచ్చింది.

ధర్మాన ప్రసాదరావు చేత రాజీనామా చేయించకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం పెద్దలపై కూడా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ధర్మాన రాజీనామా చేసినా ఆమోదించకూడదనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు. పెద్దలను కలవడంలో బిజీగా ఉన్నందున ధర్మాన రావాల్సిన విమానం అందలేదు. సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాదు వచ్చి, రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ధర్మాన ప్రసాదరావుపై అభియోగాలు మోపిన నేపథ్యంలో మరో మంత్రి గీతా రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో గీతా రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆమె లాబీయింగ్ కోసం ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.

ధర్మాన ప్రసాదరావును వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా సిబిఐ చేర్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు గీతా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు గురవుతున్నారు.

English summary
CM Kiran Kumar Reddy is suggesting minister Dharmana Prasad Rao not to resign. Kiran kumar Reddy is in touch with congress high command on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X