వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ ఇబ్రహీం సంజయ్ దత్ మిత్రుడా: సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సంజయ్ దత్ మిత్రుడా అని సుప్రీంకోర్టు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తరఫు న్యాయవాదిని అడిగింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో తనను దోషిగా నిర్దారించడంపై సంజయ్ దత్ సుప్రీంకోర్టులో అపీల్ చేసుకున్నారు. దానిపై విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఆ ప్రశ్న వేసింది. ఒప్పుకోలు వాంగ్మూలంలో సంజయ్ దత్ దావూద్ ఇబ్రహీం ఇచ్చిన డిన్నర్‌కు తన క్లయింట్ హాజరయ్యారని సంజయ్ దత్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు.

దావూద్‌తో స్నేహం గురించి చెప్తున్నారా అని సాల్వేను సుప్రీంకోర్టు అడిగింది. దుబాయ్‌లో దావూద్ ఇబ్రహీం తన నివాసంలో ఇచ్చిన విందుకు సంజయ్ దత్ హాజరయ్యారని, అయితే దావూద్‌తో మాత్రం సంబంధం లేదని సాల్వే చెప్పారు. సంజయ్ దత్‌కు దావూద్ ఇబ్రహీంతో సంబంధం కేవలం సినిమా షూటింగుకు మాత్రమే పరిమితమని చెప్పదలుచుకున్నారా అని సుప్రీంకోర్టు వెంటనే సాల్వేను అడిగింది.

ముంబై పేలుళ్లతో సంజయ్ దత్‌కు సంబంధం లేదని, ఈ వాంగ్మూలాన్ని ట్రయల్ కోర్టు అంగీకరించిందని హరీష్ సాల్వే చెప్పారు. బాబ్రీ మసీదు పేల్చివేత తర్వాత బెదిరింపు కాల్స్ తన కుటుంబానికి వస్తుండడంతో సంజయ్ దత్‌కు మూడు రైఫిళ్లు ఇచ్చారని, తనకు ఇచ్చిన రైఫిళ్లలో రెండింటిని, గ్రెనేడ్స్‌ను వెంటనే సంజయ్ దత్ తిరిగి ఇచ్చేశారని ఆయన చెప్పారు. మూడో రైఫిల్‌ను కూడా నాశనం చేయడానికి ఇచ్చాడని ఆయన చెప్పారు. సంజయ్ దత్ నివాసం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోలేదని ఆయన చెప్పారు. పేలుళ్లకు ముందు నుంచే సంజయ్ దత్ వద్ద పిస్టల్ ఉందని ఆయన చెప్పారు.

విచారణ మంగళవారం కూడా కొనసాగుతుంది. 9 ఎంఎం పిస్టల్‌ను, ఎకె 57 రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నందుకు సంజయ్ దత్‌ను 2007లో కోర్టు దోషిగా నిర్ధారించింది. తీవ్రమైన అభియోగాల నుంచి సంజయ్ దత్‌కు విముక్తి లభించింది. ఆ కేసులో ఆయనకు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. 1993లో అరెస్టయిన తర్వాత సంజయ్ దత్ 16 నెలల పాటు జైలులో ఉన్నారు. దీనిపై 2007 ఆగస్టులో సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. సంజయ్ దత్‌కు సుప్రీంకోర్టు 2007 నవంబర్‌లో బెయిల్ మంజూరు చేసింది. విదేశాల్లో షుటింగులకు వెళ్లడానికి సంజయ్ దత్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇస్తోంది.

English summary
The Supreme Court today asked Bollywood actor Sanjay Dutt's lawyer about the relationship between underworld don Dawood Ibrahim and his client. The court was hearing Mr Dutt's appeal against his conviction in the 1993 Mumbai blasts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X