వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా, జపాన్‌ల్లో భూకంపం, సునామీ రాదన్న నిపుణలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rassia Flag
మాస్కో/ టోక్యో : రష్యా, జపాన్ దేశాలను మంగళవారం భారీ భూకంపం తాకింది. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. మంగళవారం ఉదయం 8.29 గంటల సమయంలో భారీగా భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తర జపాన్, తూర్పు రష్యా మధ్య ప్రాంతంలో సముద్రంలో 580 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదైనట్లు సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

అయితే సునామీ హెచ్చరికలు ఏమీ లేవని జపాన్ ప్రభుత్వం తెలిపింది. భూకంప తీవ్రత 7.3గా నమోదైనట్లు జపాప్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లు సమాచారం లేదు.

జపాన్‌లోని ఉత్తరాన గల దీవి హొక్కాయిడో అంతటా ప్రకంపనలు చోటు చేసుకున్నాయని జపాన్ మెటిరియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. భూకంపం జపాన్ రాజధాని టోక్యోలో ఒక కుదుపు ఇచ్చింది. జపాన్ చుట్టుపక్కల తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.

English summary
A strong 7.5 magnitude earthquake struck off the eastern Russian coast to the north of Japan on Tuesday, said the US Geological Survey. The earthquake’s epicentre was located at a depth of around 580 km (360 miles) below the surface.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X