టెక్సాస్ వర్సిటీ వద్ద కాల్పులు: ముగ్గురు మృతి

Three killed in shooting near Texas Univ in US
హౌస్టన్: గురుద్వారపై కాల్పుల సంఘటనను మరిచిపోక ముందే అమెరికాలో మరో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఆ తర్వాత తనను కాల్పుకుని మరణించాడు. సోమవారం టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో బ్రేజోస్ కానిస్టేబుల్ బ్రియాన్ బాచ్‌మన్ మరణించాడు. కాల్పుల్లో మరణించిన మరొకతను గుర్తు తెలియని పౌరుడు.

మూడో మృతుడు పౌరుడు బైస్టాండర్ అంటూ నగరం కాలేజ్ స్టేషన్ అధికారి ఒకరు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. రెసిడెన్షియల్ నైబర్‌హుడ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని అసిస్టెంట్ పోలీసు చీప్ స్కాట్ మెక్‌కుల్లం ధ్రువీకరించారు. సంఘటన గురించి వివరిస్తూ సహనం వహించాలని ఆయన ప్రజలను కోరారు.

కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కాగా, మరొకరు మహిళా పౌరురాలు అని మెక్‌కుల్లం చెప్పారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి కొద్ది బ్లాక్‌ల దూరంలోనే మధ్యాహ్నం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.

తమను కస్టడీలోకి తీసుకుంటారనే ఉద్దేశంతో సాయుధుడు తనను కాల్చుకున్నాడని చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు పోలీసులు పౌరుల నుంచి 911 కాల్స్ స్వీకరించడం ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+