మహిళలు తెలివైన వారు: కిరణ్, తడబడుతూ తెలుగులో

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలు చాలా తెలివైన వారని, బ్యాంక్ రుణాల ద్వారా వారు ఆర్థిక సాధికారికత సాధిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. ఆయన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... ఉపాధిలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. మహిళల్లో సాధికారికత తీసుకు వచ్చేందుకు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు.

యువత కోసం రాజీవ్ యువకిరణాలు ప్రారంభించామని, మూడేళ్లలో 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది యువకులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. గుడిసె లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని, అందులో భాగంగా ఇప్పటికే 8 లక్షల మందికి 2004 నుండి తమ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, ఇంకా నాలుగు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

రానున్న రెండేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.3500 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించామని, 2008 నుంచి రూ.5,300 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో రెండో నౌక నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దూరదృష్టి, కష్టపడి పని చేయడం ఒక్కటే అభివృద్ధికి మంత్రమన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్టేడియాలు ఏర్పాటు చేస్తామన్నారు.

కిరణ్ ఆసాంతం తడబడుతూ తెలుగులో సందేశం ఇచ్చారు. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతి సాంస్కృతి శాఖ శకటానికి, రెండో బహుమతి డెయిరీ డెవలప్‌మెంట్ శకటానికి, మూడో బహుమతి పర్యాటక శకటానికి వచ్చింది. అటవీ శాఖ శకటానికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది.

మరోవైపు ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, కరీంనగర్లో శ్రీధర్ బాబు, నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, నల్గొండలో జానా రెడ్డి, విజయనగరంలో శత్రుచర్ల విజయరామ రావు, సంగారెడ్డిలో గీతా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో డికె అరుణలు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో, శాసనమండలిలో చైర్మన్‌లు జెండాను ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+