• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ధర్మాన ఇష్య్యూ: డైలమాలో ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి

By Pratap
|

Kiran Kumar Reddy - Dharmana Prasad Rao
హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని సిబిఐ కోరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయాలనే సందేహంలో పడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మానను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటుంది. ఈ మేరకు సీబీఐ లేఖ రాసింది. ధర్మాన రాజీనామాతోపాటే ఇదీ ముఖ్యమంత్రికి చేరింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే... ఆయన తప్పు చేసినట్లుగా ప్రకటించినట్లవుతుంది. అప్పుడు పదవి నుంచి తొలగించాల్సి ఉంటుంది.

ధర్మాన రాజీనామాను ఆమోదిస్తే ఆయన మాజీ అవుతారు. అప్పుడు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతితో అవసరమే ఉండదు. రాజీనామాను ఆమోదించి ధర్మాన ప్రాసిక్యూషన్‌కు వీలు కల్పించి, రాజీనామాను ఆమోదిస్తారా అనేది తేలాల్సి ఉంది.ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ ముఖ్యమంత్రి తన వైఖరికి తాను కట్టుబడి ఉంటారా అనేది కూడా తేలాల్సి విషయమే. ఈ విషయంపై ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంతో పాటు ధర్మానను ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలన్న లేఖ కూడా ప్రభుత్వానికి చేరింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనే విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకం కానుంది. తనపై అభియోగాలు మోపినందున, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి ధర్మాన ఇప్పటికే రాజీనామా చేశారు.

వేచి చూద్దామంటూ ముఖ్యమంత్రి ధర్మాన రాజీనామాను పక్కన పెట్టారు. రాజీనామాను ఆమోదించకుండా, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇస్తే ధర్మానకు మరింత ఇబ్బందికర పరిస్థితి తప్పదు. న్యాయ నిపుణుల సలహాతోపాటు 'పబ్లిక్ సర్వీసెస్' నిబంధనల్లో భాగంగా ధర్మాన వ్యక్తిగత వివరణ జత చేసి గవర్నర్ నరసింహన్‌కు సీఎం నోట్ పంపే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి పంపే ఈ అభిప్రాయమే గవర్నర్ తీసుకునే నిర్ణయంలో కీలకం అవుతుంది.

వాస్తవానికి దీనిపై ముఖ్యమంత్రి నేరుగా నిర్ణయం తీసుకునే అవకాశమున్నా నోట్‌ను గవర్నర్‌కు పంపాలని తీర్మానించుకోవడం పలు సందేహాలకు తావు ఇస్తోంది. ఇప్పుడు ధర్మాన విషయంలో తాను సొంతంగా నిర్ణయం తీసుకుంటే మున్ముందు మరికొందరు మంత్రుల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుందని, అందువల్ల తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్‌కే నివేదించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీబీఐ తనను కుట్రదారునిగా అభివర్ణించడాన్ని ధర్మాన తీవ్రంగా అభ్యంతరపెడుతున్నారు. తప్పు చేసింది ఒకరైతే బాధితులుగా మారుతున్నది మరొకరు అని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణమైన వైయస్ ఇప్పుడు లేనందున తమపై కుట్ర కేసు ఎలా నమోదు చేశారని అభిప్రాయపడుతున్నారు. అభియోగాలపై న్యాయస్థానంలో గట్టి పోరాటమే చేస్తానంటున్నారు. నిష్కళంకుడిగా బయటకు వస్తాననీ ధీమాగా చెబుతున్నారు. రాజీనామా చేసిన సమయంలో సీఎం కిరణ్ 'ఓపెన్'గానే మాట్లాడారని సన్నిహితుల వద్ద ధర్మాన చెబుతున్నారు.

English summary

 CM Kiran kumar Reddy is in dilemma regarding minister Dharmana Prasad Rao's resignation. Dharmana Prasad Rao was named in YSR Congress party president YS Jagan DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X