ధర్మాన రాజీనామా: అండగా అధిష్టానం వద్దకు నేతలు

ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాదాపు తొమ్మిది మంది శాసనసభ్యులు ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలో పార్టీ నేతలను కలుసుకోనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి హైకమాండ్‌ను కలిశారు. శుక్రవారం ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ నేతలు వయలార్ రవి, గులాం నబీ ఆజాద్‌లను కలుసుకుని ధర్మాన ప్రసాద రావుకు మద్దతుగా వాదించారు.
ఈ సమయంలో ఒక నివేదికను కూడా సమర్పించినట్లు తెలిసింది. ధర్మాన లేకపోతే శ్రీకాకుళంలో పార్టీ మనుగడ దెబ్బతింటుందని అందులో పేర్కొన్నట్టు సమాచారం. ఇదే విషయమై సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తోనూ కృపారాణి మాట్లాడారు. పార్టీ ప్రతినిధులు వచ్చి కలిసేంతవరకూ ధర్మాన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లనున్నారు.
బొత్స అభిప్రాయాన్ని కూడా తెలుసుకొన్న తరువాతే ధర్మాన వ్యవహారంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బొత్స కూడా ధర్మాన రాజీనామాకు ఒప్పుకోవద్దని కాంగ్రెసు పెద్దలను కోరనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సహా పార్టీలోని ముఖ్యనేతలంతా ధర్మానకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు ధర్మాన రాజీనామా అంశం తన కోర్టులో లేదని, ముఖ్యమంత్రి ఆమోదిస్తే తాను చర్యలు తీసుకుంటానని గవర్నర్ నరసింహన్ అన్నారు.












Click it and Unblock the Notifications