చెన్నైలో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సిఎల్‌బిలో కేసు?

కంపెనీల చట్టం 117 కింద ప్రతి కంపెనీ ఎన్‌సిడిల రిడెంప్షన్ కోసం రిజర్వ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వచ్చే లాభాల్లోంచి ఈ రిజర్వ్‌ను కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సెక్షన్‌ను ప్రయోగించి తమకు న్యాయం చేయాలని ఐఎఫ్‌సిఐ కంపెనీ లా బోర్డును కోరినట్టుగా తెలుస్తోంది. సిఎల్‌బి ఈ కేసును వచ్చే వారం విచారణకు చేపట్టే అవకాశం ఉంది. కాగా ఐఎఫ్‌సిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కౌంటర్ పిటిషన్ దాఖలుచేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వారాల గడువిచ్చింది.
ఇటీవల రాష్ట్రానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు తమను దారుణంగా వంచించారని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డీమ్యాట్ ఖాతాల్లో లేని షేర్లను ఉన్నట్టుగా నమ్మించేందుకు తమ పేరుతో పత్రాలను ఫోర్జరీ చేశారని దక్కన్ క్రానికల్ ప్రమోటర్లపై కార్వీ కేసు పెట్టింది.
ఈ పత్రాలను చూపించి లేని షేర్లను ఉన్నట్టుగా నమ్మించి షేర్ల తాకట్టుపేరుతో పైనాన్షియల్ సర్వీసుల సంస్థ ఫ్యూచర్ కాపిటల్‌ను దాదాపు రూ.170 కోట్ల మేరకు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు టి.వెంకట్రామ్‌రెడ్డి, టి.వినాయక్ రవి రెడ్డి, పికె అయ్యర్ మోసగించారని కార్వీ ఆరోపించింది. సత్యం కంప్యూటర్స్, జగన్ కంపెనీల పరంపరలో ఇప్పుడు దక్కన్ క్రానికల్ చేరిందని మీడియా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దక్కన్ క్రానికల్ వ్యవహారంపై వచ్చిన మీడియా వార్తలను క్రోడీకరిస్తే సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications