క్రికెట్ అనుకుంటున్నారు:కిరణ్‌పై విద్యాసాగరరావు సెటైర్

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కేంద్రం భద్రతపై హామీ ఇవ్వలేక పోతుందని విద్యాసాగర రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆపాల్సింది బల్క్ ఎస్సెమ్మెస్‌లు కాదని.. బంగ్లాదేశ్ చొరబాటుదారులను అన్నారు. రాజ్యాంగంలో లేని విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. సరిహద్దు ప్రాంతాల నుండి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోనంత కాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని అన్నారు.
అస్సాం అల్లర్లను అదుపు చేయడంలో, అక్కడి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రస్తుతం మన దేశంలో 12వేల మందికి పైగా అక్రమ చొరబాటుదారులు ఉన్నారన్నారు. చొరబాటుదారులు దేశంలోకి రాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే అస్సాం వంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు.












Click it and Unblock the Notifications