వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుసగుస: చెవిలో చెప్పారు... సభ వాయిదా వేశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajiv Shukla - P J Kurien
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులపై రాజ్యసభలో గొడవ జరుగుతుండగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా తన సీట్లోంచి లేచి, అధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ వద్దకు వెళ్లి ఆయన చెవిలో గుసగుస చెప్పడం సభలో గందరగోళానికి దారి తీసింది. మంగళవారం రాజ్యసభలో బొగ్గు బ్లాకుల కేటాయింపులపై గొడవ జరుగుతోంది. విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పిజె కురియన్ తొలిసారిగా సీట్లో కూర్చుని సభను నిర్వహిస్తున్నారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ విపక్షాలన్నీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

సరిగ్గా అదే సమయానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా తన సీట్లోంచి లేచి, అధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ వద్దకు వెళ్లారు. ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అంతే.. ఒక్కసారిగా మళ్లీ ప్రతిపక్ష సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు. శుక్లా రహస్యంగా చెప్పిన విషయాలు.. కురియన్ ముందున్న మైకులోంచి సభ మొత్తానికి వినిపించేశాయి. సభను ఈ రోజు మొత్తానికి వాయిదా వేసేయండని శుక్లా కురియన్ చెవిలో చెప్పారు. దీంతో, కురియన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

కాగ్ బయటపెట్టిన కోల్‌గేట్ కుంభకోణం పార్లమెంటును కుదిపేసింది. అక్రమాలు జరిగిన సమయంలో బొగ్గు శాఖను నిర్వహించిన ప్రధాని మన్మోహన్‌ సింగ్ వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేశాయి. దీంతో లోక్‌సభ తొలుత మధ్యాహ్నం వరకు, తర్వాత బుధవారానికి వాయిదాపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కాంగ్రెస్ నేత పీజే కురియన్ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇదే వివాదంతో వాయిదా పడింది.

English summary

 Union minister Rajiv Shukla kicked off a controversy on Tuesday after he was heard telling Rajya Sabha deputy chairman P J Kurien to adjourn the House for the day after the opposition led by BJP created uproar over the CAG report on Coalgate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X