అస్సాం అల్లర్లు: ట్విట్టర్‌పై వేటు యోచనలో ప్రభుత్వం

అస్సాం అల్లర్ల నేపథ్యంలో వెల్లువెత్తుతున్న ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌ల హెచ్చరిక సందేశాలను అదుపు చేయడంలో ట్విటర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సాయాన్ని ప్రభుత్వం కోరింది. దీనిపై సరిగ్గా స్పందించని 254 వెబ్‌సైట్లను ఇప్పటికే స్తంభింప జేసిన ప్రభుత్వం, ట్విటర్‌నూ ఆ జాబితాలో చేర్చేయోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ మేరకు టెలికం శాఖకు కేంద్ర హోంశాఖ సూచించినట్టు సమాచారం. యూ ట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సైట్లు కేంద్రం వినతిపై సానుకూలంగా స్పందించగా, ట్విటర్ మాత్రం ముందుకు రాలేదు. ట్విటర్‌లో పోస్టు అయిన 28 పేజీల విషయంలో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా ఇటీవల జరిగిన అస్సాం అల్లర్ల నేపథ్యంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలోని ఈశాన్య రాష్ట్రవాసులు తరలి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇందుకు కారణం ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌లు పాక్ నుండి రావడమే కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం సోషల్ వర్కింగ్ సైట్లను పాక్ నుండి వచ్చే వాటిపై నియంత్రణ పాటించాలని సూచించాయి. కానీ కొన్నివెబ్ సైట్లు ప్రభుత్వం విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో ఆయా సైట్ల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ట్విట్టర్ పైనా తీసుకునే అవకాశముంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications