రూ.49 లక్షలు చోరీ చేసిన లేడీ టెక్కీ, కటకటాల వెనక్కి

దాన్ని అవకాశంగా తీసుకుని ప్రతీక్ష ఇద్దరు ఖాతాదారుల చిరునామాలు మార్చేసింది. దీంతో బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు కొత్త చిరునామాలకు వెళ్లాయి. తప్పుడు వ్యక్తుల చేతుల్లో అవి పడ్డాయి. వాటితో వారు వస్తువులు కొనుగోలు చేశారు. డబ్బులు బ్యాంకు నుంచి తీసుకున్నారు. అవకతవకలు జరిగినట్లు అనుమానించిన బ్యాంక్ అధికారులు సాఫ్ట్‌వేర్ కంపెనీకి సమాచారం ఇచ్చారు. డేటా మార్పు ప్రతీక్ష కంప్యూటర్ నుంచి జరిగిందని గుర్తించారు.
టిసిఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగం అధికారులు టెక్కీని అశోక్‌నగర్‌లోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. తన నేరాన్ని ఆమె విచారణలో అంగీకరించింది. పోలీసులు ప్రతీక్ష మిత్రుల కోసం గాలిస్తున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ చేసిన ప్రతీక్ష ఏడేళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తోంది. డబ్బులు అత్యవసరం కావడం వల్ల ఫ్రెండ్ కోసం ఆమె ఈ నేరం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
కొద్ది నెలల క్రితం ప్రతీక్షకు వివాహం జరిగింది. ఆమె భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. కొందరు ఖాతాదారుల ఖాతాలు ఏడాదికి పైబడి యాక్టివ్‌గా లేకపోవడం గమనించి, వారి చిరునామాలను ప్రతీక్ష మార్చేసింది. ఆ తర్వాత ఖాతాదారుల పేరు మీద క్రెడిట్, డెబిట్ కార్డులకు రిక్వెస్ట్ పెట్టింది. ఆ పత్రాలను ప్రతీక్ష ఫ్రెండ్ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె ఫ్రెండ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ ఖాతాదారుడు తనకు లావాదేవీల పత్రాలు రావడం లేదని చెప్పడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. ప్రతీక్షను సస్పెండ్ చేసినట్లు టిసిఎస్ ఇసర్వ్ అధికార ప్రతినిధి చెప్పారు.