సిఎం అటెండర్‌లా చేతులు కట్టుకున్నారు: గాలి ఎద్దేవా

సిఎం అటెండర్‌లా చేతులు కట్టుకొని కూర్చుని ఉన్నారన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన జైరాం ఇలా వ్యవహరించడం ఘోరమని, రాష్ట్రానికి ఇంతకంటే అవమానం మరొకటి లేదన్నారు. ఓ గ్రామ సర్పంచి అయినా ఢిల్లీ వెళ్తే మరింత ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారని, కానీ.. కిరణ్ పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దల చుట్టూ దేహీ అని తిరిగారని విమర్శించారు. పదవి లేకపోతే చచ్చిపోతారా? ఎందుకీ గులాం గిరీ? ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీ రాణి మాదిరిగా కూర్చుంటే సిఎంలు, మంత్రులు పదవులు కాపాడుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.
కొత్త సిఎం, కేబినెట్ వస్తే అయినా రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని ధర్నా చేసిన రైతులను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. వ్యవసాయం, రెవెన్యూ, నీటి పారుదల శాఖలకు ఎవరు మంత్రో తెలియడం లేదని మండిపడ్డారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో జాప్యానికి చంద్రబాబే కారణమని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించడం దారుణమని, బాబు చలవతో ఆరేళ్ళు ఎంపీగా ఉన్నానన్న విషయం విస్మరించి యార్లగడ్డ మాట్లాడుతున్నారని ముద్దుకృష్ణమ అన్నారు.












Click it and Unblock the Notifications