జగన్‌పై సిబిఐ విచారణ: కాంగ్రెస్‌ను వీడాకే.. జైట్లీ వ్యాఖ్య

వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసులో ఉన్నప్పుడు ఎలాంటి విచారణలు, దర్యాఫ్తులు లేవన్నారు. ఆ పార్టీ నుండి బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకున్న తర్వాతనే సెంట్రల్ బ్యరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), ఈడి విచారణలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మంత్రి ధర్మాన ప్రసాద రావుపై సిబిఐ ఛార్జీషీటు, రాష్ట్రంలో అవినీతి తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ పై విధంగా స్పందించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో అవినీతిపై విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోందని, అవినీతి జరిగినప్పుడే విచారణ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారంపై అరుణ్ జైట్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications