చంద్రుడిపై తొలి అడుగు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించారు. ఆరవ ఏటనే తొలిసారిగా విమానంలో ప్రయాణించారు. 1969 జూలై 20న చందమామపై దిగిన అపోలో 11 వ్యోమనౌక సారథి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. 20వ శతాబ్దపు శాస్త్రవిజ్ఞానపరమైన సాహస యాత్రలలో అత్యంత ప్రముఖమైనది ఈ యాత్ర.
చంద్రుడిపై కాలు మోపిన అనంతరం ఒక మనిషికి ఇది చిన్న అడుగే కానీ, మానవాళికి భారీ ముందంజ అని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పుడు అన్నారు. అప్పుడు చంద్రమండల యాత్రకు వెళ్లి వారిలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కాలిన్స్ ఉన్నారు. ప్రయోగాల నిమిత్తం వారు నమూనాలు సేకరించారు.
చంద్రునిపై కాలుమోపిన ఈ క్షణాలను సుమారు 50 కోట్ల మంది టీవిలలో చూశారట. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన పదహారవ ఏటనే పైలట్ లైసెన్స్ పొందారు. అయితే అప్పటికి ఆయనకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాలేదట.












Click it and Unblock the Notifications