వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీని చూస్తే వణుకు: టి-ఎంపీలపై నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPI Narayana
నల్గొండ/ఖమ్మం: తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో జై తెలంగాణ అన్నందుకు తమను సస్పెండ్ చేశారంటూ ప్రజలను మభ్య పెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పట్టపగటి డెకాయిట్లని ధ్వజమెత్తారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. టి-కాంగ్రెస్ నేతలు ఇక్కడ కప్పల్లా బెకబెకమంటూ, రొయ్యల్లా మీసాలు తిప్పుతారన్నారు. కానీ, ఢిల్లీకి వెళ్తే ఉష్ట్ర పక్షుల్లా మూతులు ముడుచుకుని, సోనియాను చూస్తే వణికిపోతూ పైజామాలు తడుపుకొంటారని మండిపడ్డారు.

శ్మశానంలా ఉన్న తెలంగాణను కాకుండా సంపదతో ఉన్న ప్రత్యేక రాష్ట్రం కోసం తాము పోరాడుతున్నామన్నారు. పండుగల పేరిట తెలంగాణ ప్రక్రియను వాయిదా వేస్తున్న కాంగ్రెస్‌ను భోగి మంటల్లో వేసి తగులబెడితేనే ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్నారు. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కావడం దేశానికి దౌర్భాగ్యమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఆత్మహత్య చేసుకోరాదని, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న నేతలే చేసుకునేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

అలాగే ఏదో ఒక వివాదం రెచ్చగొట్టే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ దోపిడీదారని ధ్వజమెత్తారు. పార్టీల నాన్పుడు ధోరణి వల్ల ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తన వైఖరి మార్చుకున్నాడని విమర్శించారు. ప్రజలు విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని విమర్శించారు.

నేతి బీర కాయలో నెయ్యి ఎంత ఉంటుందో ధర్మాన పేరులో ధర్మం కూడా అంతేనని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధుల వ్యయంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఖమ్మంలో సూచించారు.

English summary

 CPI state secretary Narayana blamed Telangana Congress Parliment Members on Sunday in Nalgonda district public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X