నర్తనపై చిత్రహింసల కేసు: తల్లికి, ప్రియుడికి జైలు శిక్ష

Nellore District
నెల్లూరు: చిన్నారి నర్తనను చిత్రహింసలు పెట్టిన కేసుల్లో ఆమె తల్లికి, తల్లి ప్రియుడికి నెల్లూరు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. వారికి 72 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో 16 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. నర్తనను ఆమె తల్లి నాగచైతన్య, తల్లి ప్రియుడు నగేష్ రెండేళ్ల క్రితం చిత్రహింసలకు గురి చేశారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే కారణంతో నర్తనను వారిద్దరు తీవ్రంగా హింసించారు. ఈ సంఘటన రెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో జరిగింది.

నర్తనకు 9 ఏళ్ల వయస్సు. ప్రస్తుతం ఆమె ఐసిఎస్‌లో ఉంటోంది. విద్యాభ్యాసం కూడా చేస్తోంది. 2010 సెప్టెంబర్ 14వ తేదీన నర్తనను చిత్రహింసలకు గురి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగచైతన్య ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండడంతో స్థానికులు అనుమానం వచ్చి తాళం తీసి చూశారు. తీవ్రమైన గాయాలతో ఉన్న నర్తనను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్రహింసల వల్ల అయిన గాయాలతో ఆమె ఒళ్లంతా పుండ్లు పడ్డాయి.

ఈ స్థితిలో ఓ ప్రభుత్వేతర సంస్థ ముందుకు వచ్చి ఆమెకు చెన్నైలో వైద్యం చేయించింది. పలువురు దాతలు వైద్యానికి విరాళాలు అందించారు. నాగచైతన్యపై, నగేష్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసులో రెండేళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు ఈ కేసులో వారిద్దరికి శిక్ష పడింది. తెలియక తప్పు చేశానని, బిడ్డను తాను తిరిగి తీసుకుంటానని నాగచైతన్య వేడుకున్నా జిల్లా కలెక్టర్ అంగీకరించలేదు.

నాగచైతన్య, నగేష్‌ల తరఫున వాదించడానికి న్యాయవాదులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. నర్తనను దత్తత తీసుకోవడానికి పలువురు ముందుకు వచ్చినప్పటికీ కలెక్టర్ అంగీకరించక ఐసిఎస్‌లోనే ఉంచారు. మూడు కేసుల కింద నాగచైతన్య, నగేష్‌లకు 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే శిక్ష ఏకకాలంలో అమలవుతుంది కాబట్టి ఐదు నెలల్లో శిక్ష ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+