చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయపాటి నాకు పోటీ కాదు: టిటిడి చైర్మన్ కనుమూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanumuri Bapiraju
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి దక్కించుకోవాలని ప్రయత్నించిన మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు, గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు, రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామి రెడ్డి తనకు పోటీ కాదని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు సోమవారం అన్నారు. టిటిడి చైర్మన్ పదవి వచ్చినందుకు వారు తనకు అభినందనలు తెలియజేశారన్నారు. మరోసారి టిటిడి అధ్యక్ష పదవి పొందిన ఆయన తొలిసారిగా తిరుమల వచ్చారు.

సతీమణీతో కలసి భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టిటిడి చైర్మన్ పదవి మరోసారి దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో మూడోసారి చైర్మన్‌గా చేసే అవకాశం లభించిందన్నారు. భక్తుల సౌకర్యాల దృష్ట్యా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తానన్నారు. భక్తులు, మీడియా ఇచ్చే సూచనలు తప్పకుండా ఆచరణలో పెడతానని అన్నారు.

కాగా బుధవారం రాత్రి 11.35 గంటలకు టిటిడి చైర్మన్‌గా ప్రమాణం చేస్తానని చెప్పారు. బోర్డు సభ్యురాలిగా నియమితులైన మంగళగిరి ఎమ్మెల్యే కొండ్రు కమల సోమవారం రాత్రి తిరుమల వచ్చారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా టిటిడి చైర్మన్ పదవి దక్కక పోవడంతో రాయపాటి సాంబశివ రావు అలక వహించిన విషయం తెలిసిందే.

English summary
TTD chairman Kanumuri Bapiraju said on Monday that Guntur MP Rayapati Sambasiva Rao, T.Subbirami Reddy and Adikeshavulu are not disappointed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X