పళ్లంరాజు వ్యాఖ్యలపై డిఎంకె అధినేత కరుణానిధి ఫైర్

తమిళనాడు, తమిళ ప్రజల మనోభావాలను పళ్లంరాజు ప్రకటన దెబ్బ తీసిందని ఆయన ఒక ప్రకటనలో అన్నారు. శ్రీలంక మిత్ర దేశమని, శిక్షణ కొససాగుతుందని పళ్లంరాజు సోమవారం అన్నారు. స్థానిక ప్రభుత్వాలు అభ్యంతరాలు తెలియజేస్తున్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎల్లిటీటిఇపై 2009లో యుద్ధం తర్వాత శ్రీలంక భారత్ కన్నా చైనాను, పాకిస్తాన్‌నే మిత్ర దేశాలుగా పరిగణిస్తోందని కరుణానిధి అన్నారు. చైనా రక్షణ మంత్రి ఆగస్టు 29వ తేదీన శ్రీలంకలో పర్యటనకు వెళ్తున్నారని, అలాగే సెప్టెంబర్ 15వ తేదీన ఉన్నత స్థాయి చైనా ప్రతినిధి బృందం కూడా శ్రీలంకను సందర్శిస్తోందని ఆయన చెప్పారు.
భారత్ కన్నా చైనా ఆరింతలు ఎక్కువ సాయం చేస్తున్నప్పుడు శ్రీలంక భారత్‌ను మిత్ర దేశంగా ఎలా చూస్తుందని ఆయన అడిగారు. అది ఏకపక్షం కాకపోతే సామరస్యపూర్వకమైందని ఎలా భావిస్తామని ఆయన అడిగారు. పళ్లంరాజు వ్యాఖ్యలపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిస్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో శిక్షణ పొందుతున్న శ్రీలంక సిబ్బందిని వెనక్కి పంపించేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications