రాయలసీమ కంటే 44 దేశాలు చిన్నవే: బైరెడ్డి వ్యాఖ్య

రాయలసీమకు చెందినవారు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినప్పటికీ ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదన్నారు. సీమకు రావాల్సిన ఉద్యోగాలను, ప్రాజెక్టులను, నీటి వాటాలను ఇతర ప్రాంతాలకు చెందిన వారు తరలించుకుపోతున్నా, పదవుల్లో ఉన్న వారు ఏనాడూ నోరెత్తి మాట్లాడలేదన్నారు. ఈ ప్రాంతవాసులు రాజధాని కర్నూలును సైతం రాష్ట్ర అభివృద్ధిని ఆశించి త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ నేడు ప్రపంచంలోనే అత్యంత దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వంటి నాయకులే రాయలసీమ ఆత్మగౌరవాన్ని నడిబజారులో కించపరుస్తున్నారన్నారు. ఇటువంటి నాయకులను విద్యార్థులు నిలదీయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చేసిన త్యాగాల వల్ల మిగిలిన కష్ట నష్టాలను దిగమింగి, తమ బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
సీమలో ఉన్న తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, మంత్రాలయం, మహానంది, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల ద్వారా సమకూరే ఆదాయంతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఉజ్వలంగా అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు. విద్యార్థుల కోసం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట పథకం లాంటివి కూడా ప్రత్యేక రాష్ట్రంలో అవసరం ఉండవన్నారు. త్వరలో చేపట్టనున్న 800 కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా సీమకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతామన్నారు.












Click it and Unblock the Notifications