కోల్ స్కాం: దాసరి నారాయణ రావు బయటపడ్డారా?

Dasari Narayana Rao
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణాన్ని ఎదుర్కొనే అంశంలో మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు తప్పించుకున్నారని అంటున్నారు! 2006-09 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు నిత్యం పార్లమెంటులో ఇరు సభలను స్తంభింపచేస్తున్నాయి. బొగ్గు స్కాం జరిగిన సమయంలో ఆ శాఖ ఇంచార్జ్‌గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండగా... సహాయమంత్రులుగా దాసరి నారాయణ రావుతో పాటు గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంతోష్ బగ్రోడియాలు ఉన్నారు.

అయితే ఇప్పుడు దాసరి, సంతోష్‌లు మంత్రివర్గంలో లేకపోవడంతో వారు ప్రతిపక్షాల నుండి ఎదురుదాడిని తప్పించుకున్నారని అంటున్నారు. దాసరి, సంతోష్ ఇద్దరూ ఆ సమయంలో రాజ్యసభ సభ్యులే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ ఇద్దరు మాజీలు కావడం అంతేకాకుండా ఇంచార్జిగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఈ స్కాం పైన వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఓ రకంగా వీరిద్దరి వల్ల ప్రధాని ఇరుక్కుపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... బొగ్గు బ్లాకుల కేటాయింపులలో జరిగిన అవకతవకలకి దాసరి నారాయణ రావు కూడా బాధ్యుడే అని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో ప్రధానితో పాటు నాటి బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దాసరి పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కోల్ బ్లాకులను కేటాయించే విషయంలో మార్పులు, చేర్పులపై సహాయ మంత్రి సూచనలు, సలహాలు ఇస్తుంటారని చెప్పారు. బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో దాసరి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని విమర్శించారు.

ప్రధానిని దాసరి, సంతోష్‌లు పక్కదోవ పట్టించారని ఆరోపణలు వినవచ్చాయి. ప్రధాని సమీక్షా సమావేశాలకు హాజరైంది దాసరి నారాయణ రావే అని అంటున్నారు. వేలం ద్వారా నష్టాలపై ప్రధానికి దాసరి లేఖలు రాశారని, తద్వారా వేలం ప్రతిపాదనలను నీరుగార్చారని ఆరోపణలు వస్తున్నాయి. దాసరి వైఖరిపై కోల్ సెక్రటరీ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కోల్ బ్లాకులకు బొగ్గును కేటాయించే విషయంలో దాసరి, సంతోష్‌లు పరిధిని మించి వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+