రాజీనామాకు సిద్ధపడ్డ ఎంపి ఎస్పీవై రెడ్డి: సిఎం సై అంటే

శ్రీశైలం డ్యాం నుండి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడంపై ఎస్పీవై రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాం నుండి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగానే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమ జిల్లాకు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయం తీవ్రమైనదని, అది చిన్న విషయం కాదని ఎస్పీవై రెడ్డి అన్నారు. దీనిపై సిఎంతో మాట్లాడుతానని చెప్పారు.
కాగా ఆ తర్వాత ఎస్పీవై రెడ్డి స్పీకర్‌కు రాజీనామా ఇవ్వాలనుకున్న సమయంలో పలువురి సూచనల మేరకు ఇప్పటికి వెనక్కి తగ్గి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించాక రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సిఎంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లనున్నారు. రేపటి భేటీలో కిరణ్‌తో మాట్లాడాక ఆయన స్పందనను బట్టి ఎస్పీవై రెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు. కిరణ్ అనుకూలంగా స్పందిస్తే సరే లేదంటే వెంట ఉంచుకున్న రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించే అవకాశముంది.
మరోవైపు శుక్రవారం ఉదయం శ్రీశైలం డ్యాం నుండి సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 838.70 ఉంది. 21,761 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీశైలం వద్ద విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. దాదాపు రెండు నెలల తర్వాత ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నాలుగు యూనిట్లలో 486 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.












Click it and Unblock the Notifications