దొంగ మంత్రులను కాపాడేందుకే..: సిఎంపై మోత్కుపల్లి

Mothukupally Narasimhulu
వరంగల్/న్యూఢిల్లీ: విద్యుత్తు సంక్షోభం ఉన్నా దొంగ మంత్రులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారని తెలుగుదేశం శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. విద్యుత్ కోతకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శనివారం వరంగల్లులో మహాధర్నాను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ మరో శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి ఏడు గంటలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఏడు గంటలు కరెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్సించారు.

ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమైత్తారు. విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4వ తేదీన ఎల్బీ నగర్‌లోనూ కూకట్‌పల్లిలోనూ ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

పదివేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం అదనంగా చేసిందేమీ లేదని ఆయన అన్నారు. రెండు పూటలా భోజనం చేయని కుటుంబాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోయిందని ఆయన విమర్శించారు. పీజులు చెల్లించలేక బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే తప్ప విద్యను అభ్యసించే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

చిన్న చిన్న కారణాలతో ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం ఇస్తున్న నిధులను ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన అన్నారు. విద్యను అందించాల్సిన ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తోందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5,6 తేదీల్లో ఢిల్లీలో ఉంటారని, బీసీ డిక్లరేషన్‌కు మద్దతు సంపాదించేందుకు చంద్రబాబు జాతీయ నాయకులను కలుస్తారని ఆయన అన్నారు. బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరడానికి చంద్రబాబు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+