బాలిక ఆత్మహత్య కేసు ట్విస్టు: లైంగిక దాడి కోణం

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లాలోని పామర్రులోని ప్రైవేట్ పాఠశాలలో ఎస్ఎస్సీ చదువుతున్న బాలిక ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. మృతికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చునని కోణం ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. రెండు వారాల క్రితం పామర్రులో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది.

పదిహేనేళ్ల పల్లవి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు వచ్చే వరకు ఆగకుండా హాస్టల్ అధికారులు ఆమెను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బతికించడానికే అలా చేశామని హాస్టల్ అధికారులు చెప్పారు. అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చేశారు.

సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. తమ బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విషయంపై తమకు పాఠశాల అధికారులు సరిగా చెప్పలేదని వారు ఆరోపించారు. దాంతో స్థానికులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. బాలిక విస్రాను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించాలని పోలీసులు వైద్యులకు సూచించారు.

పామర్రు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై బాలిక తల్లిదండ్రులు నాగమణి, దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే పాఠశాలలో పల్లవి చదువుతోంది. మరణించిన రోజు పల్లవికి కనకరాజు అనే వ్యక్తి నుంచి పోన్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

కనకరాజు కూడా పల్లవి గ్రామానికి చెందినవాడే. ముసునూరు మండలం పెదపాటివారిపాలెం గ్రామానికి చెందిన కనకరాజుపై తొలుత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు అతన్ని విచారించారు. అతను రెండు రోజుల తర్వాత గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పల్లవి మృతికి సంబంధించి ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ శుక్రవారం నివేదికను సమర్పించింది. మరణానికి కొద్ది గంటల ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆ పరీక్షల్లో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+