• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కిషన్‌రెడ్డి, ఇద్దరు కార్పేరేటర్ల హత్యకు టెర్రరిస్టుల కుట్ర?

By Srinivas
|

Kishan Reddy
బెంగళూరు/ముంబయి/హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న ఆరోపణలపై హైదరాబాదుకు చెందిన ఉబేద్ ఉర్ రెహ్మాన్‌ను గురువారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా పోలీసులు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారు. మహారాష్ట్రలో నలుగురు, హైదరాబాదులో ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వీటితో అరెస్టుల సంఖ్య 16కు చేరుకుంది.

అయితే హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో వీరంతా కల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాదులో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదుకు చెందిన ఒక హిందూ సంస్థలకు సంబంధమున్న ఓ ఎమ్మెల్యేను, మరో ఇద్దరు కార్పోరేటర్లను వారు టార్గెట్ చేసుకున్నారని చెప్పారు. అయితే వారు టార్గెట్ చేసుకున్న ఆ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డియే అని భావిస్తున్నారు.

బెంగళూరు పోలీసు కమిషనర్ జ్యోతి ప్రకాష్ మిర్జి విలేకరులకు కళ్లు చెదిరే వాస్తవాలను తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఉబేద్ ఉర్ రెహ్మాన్ ఉగ్రవాద సంబంధం ఉన్న పలువురితో కలిసి ఈ కుట్ర పన్నినట్లు చెప్పారు. హత్యలతో స్థానికంగా మత ఘర్షణల్ని సృష్టించాలన్నదే ఉబేద్, ఇతర ఉగ్రవాదుల లక్ష్యమని, పట్టుబడిన వారికి సౌదీ అరేబియాలో ఉంటున్న ఉగ్రవాదుల నుంచి సూచనలు అందేవని విచారణలో గుర్తించినట్లు చెప్పారు.

బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదుల నుంచి 7.65 ఎంఎం పిస్టల్ ఒకటి, ఏడు కార్ట్రిడ్జ్‌లు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, మూడు పెన్ డ్రైవ్‌లు, నాలుగు ఏటీఎం కార్డులు, ఏడు ల్యాప్‌టాప్‌లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు జీహాదీ సాహిత్యం, చెన్నై, భారతదేశాలకు చెందిన మ్యాప్‌లు, ఇరాన్ మ్యాప్, ఉర్దూ వార్తా పత్రిక కటింగ్‌లు కూడా ఉన్నాయి. వీరిని ప్రశ్నిస్తే వచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోగల వేర్వేరు ప్రాంతాల్లో మరో నలుగురిని అరెస్టు చేశారు.

వీరికి కూడా లష్కరే తాయిబా, హర్కతుల్ జీహాద్ అల్ ఇస్లామీ (హుజి) సంస్థలతో సంబంధాలున్నాయి. వీరంతా 2010 ఏప్రిల్ 18న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుడు సంఘటనలో నిందితులు. ఈ నలుగురు, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఇర్షాద్ అలియాస్ ఉబేదుర్ రెహ్మాన్, తొలుత అరెస్టయిన 11 మంది కలిసి భారీ విధ్వంసం సృష్టించడంతో పాటు కర్ణాటకలో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులను హతమార్చేందుకు కుట్ర పన్నారు.

కర్ణాటకలో పట్టుబడిన ఉగ్రవాదులలో.. ఒక డిఆర్‌డివో శాస్త్రవేత్త, ఒక పాత్రికేయుడు కూడా ఉన్నారు. ముతీ ఉర్ రెహ్మాన్ సిద్దిక్ అనే ఈ పాత్రికేయుడు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో పనిచేస్తూ.. నేతలతోపాటు ప్రముఖ పాత్రికేయుల కదలికలపై ఉగ్రవాదులకు సమాచారం అందిస్తుండేవాడని తెలిసింది. కన్నడ దిన పత్రికకు చెందిన ప్రముఖ కాలమిస్టును హతమార్చేందుకు వీరు కుట్ర పన్నినట్లు సమాచారం. నిందితులలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను సైబర్ క్రైం విభాగం సాయంతో ఛేదించగా, ఉగ్రవాదుల కార్యకలాపాలపై కీలక సమాచారం లభ్యమైంది.

English summary

 In continuing crackdown on the “terror module” busted in Karnataka, city police have arrested a youth in Hyderabad with alleged links to Lashkar and HuJI, taking the number of those detained in this connection to 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X