వైఎస్ మాట వింటే జగన్‌లా జైళ్లో ఉండేవాన్ని: మాగంటి

మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పిన పనులన్నీ చేసి ఉంటే చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తినవలసి వచ్చేదని అన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్థనపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కోనడానికి కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి కుంభకోణాలేనని ఆరోపించారు.
అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మంత్రులను పావులుగా వాడుకున్నారని విమర్శించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు లబ్ధి చేకూర్చే విధంగా డబ్బుల మూటలు ఇవ్వనందు వలన తనను మంత్రివర్గం నుంచి బయటికి పంపారని ఆరోపించారు. అదే తనకు వరమైందని, అలా కాక వైయస్ చెప్పిన పనులన్నీ చేసి ఉంటే తన పరిస్థితి వేరే విధంగా ఉండేదన్నారు.












Click it and Unblock the Notifications