అసెంబ్లీలో చొక్కా చించేసుకుని ఎమ్మెల్యే హంగామా

Jharkhand Map
రాంచీ: తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ జార్ఖండ్ శాసనసభలో ఓ ప్రతిపక్ష శానససభ్యుడు చొక్కా చించేసుకున్నాడు. ఈ సంఘటనతో శానససభ రెండు సార్లు వాయిదా పడింది. తన నియోజకవర్గం బొకారోలో పేదల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సమ్రేష్ సింగ్ అనే శాసనసభ్యుడు చొక్కా చెంపేసుకున్నారు.

బొకారో ఉక్కు కర్మాగారం వల్ల నిరాశ్రయులైన పేదల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జెవిఎం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ సిపి సింగ్ రెండో సారి వాయిదా వేశారు. రాంచీ శివారులోని నగరి గ్రామంలో ఉక్కు కార్మాగారం వల్ల నిరాశ్రయులైన పేదలకు పునరావాసం కల్పిచాలని ప్రతిపక్ష జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజా తాంత్రిక్) డిమాండ్ చేస్తోంది.

సోమవారం సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే తమ డిమాండ్‌పై ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శాసనసభలో తీవ్ర ఉత్కంఠకు కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+