తెలంగాణపై ఢిల్లీకి: జానా రెడ్డి ఇంట్లో మంత్రులు భేటీ

తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సోనియా గాంధీని కోరుతూ సాధ్యమైనంత తొందరగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఈ లేఖపై మిగిలిన మంత్రుల సంతకాలను సేకరించాలని.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సోనియా గాంధీ ఢిల్లీకి వచ్చిన వెంటనే ఆమెను కలవాలని నిర్ణయించారు.
తక్షణమే తెలంగాణ ప్రకటించాల్సిన ఆవశ్యకతను కేంద్రానికి తెలియజేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. తాను తయారు చేసిన నమూనా లేఖను జానా రెడ్డి మంత్రులకు చదివి వినిపించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంపై మంత్రి బస్వరాజు సారయ్య స్పందిస్తూ తమకు పదవులు వద్దని, ప్రత్యేక రాష్ట్రమే కావాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications