కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలకు మేమూ సై!: కిరణ్, ఆలస్యమైందన్న బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
కర్నూలు/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కిరణ్ మంగళవారం కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం దూబగుంటలో ఇందిర బాట ప్రారంభించారు. హైకోర్టు తీర్పు తెలిసిన వెంటనే కిరణ్ ఎన్నికల అంశంపై స్పందించారు. కోర్టు నిర్ణయం మేరకు మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కిరణ్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా దూబగుంటలో కిరణ్ మాట్లాడారు. సాగునీటి విషయంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇస్తామని, సీమ తాగు, సాగు నీటికి శ్రీశైలమే ఆధారమని చెప్పారు. జూన్ కల్లా రుణాలు చెల్లించి మళ్లీ లక్ష రూపాయల వరకు తీసుకున్న రైతులకు ప్రభుత్వమ వడ్డీ చెల్లిస్తుందన్నారు. రైతులపై భారం వేయబోమన్నారు.

సోనమసూరి బియ్యానికి క్వింటాల్‌కు రూ.1500 చెల్లిస్తున్నామన్నారు. కరెంట్ కష్టాలు త్వరలో తొలగిపోతాయని ఆశిస్తున్నానన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. గోకర్ల రిజర్వాయర్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తయిందని చెప్పార. ఉపాధి హామీ పథకం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పొలం పనులకు కూలీలు దొరకడం లేదన్నారు. కాగా కిరణ్ వరి పొలంలో నాట్లు వేశారు.

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా హైకోర్టు తీర్పుపై స్పందించారు. స్థానిక ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, ఇది అభివృద్ధికి ఆటంకమవుతుందని బొత్స అన్నారు. బిసి రిజర్వేషన్ల పెంపు వల్ల పట్టణ ప్రాంతాల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని, సర్పంచ్, జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలలో బిసి రిజర్వేషన్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజ్యాంగ అంశాలు, కోర్టు తీర్పు, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said on Tuesday in Kurnool district that the government is ready to obey orders of state High Court on local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X