భార్య మాజీ భర్తను చంపిన వ్యక్తి, వచ్చేసినందుకే..

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా బొత్తునపల్లి గ్రామానికి చెందిన ఆనంపల్లి నాగార్జున (23)తో సుశీలకు పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 2011, జనవరిలో ప్రొద్దుటూరులోని శివాలయంలో వీరు దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్ ఫేజ్-2లో ఓ గదిని అద్దెకు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రమేష్ తొమ్మిది రోజుల క్రితం నగరానికి వచ్చాడు. పిల్లలను చూపించమని భార్యను కోరాడు. అందుకు అంగీకరించిన సుశీల ఇంట్లో స్థానం కల్పించింది. తను ఉండగానే నాగార్జునతో సుశీల చనువుగా ఉండటంతో జీర్ణించుకోలేకపోయిన రమేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నాగార్జునను హత్య చేయాలని పథకం వేశాడు.
ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రపోతున్న నాగార్జున తలపై రోకలిబండతో మోది హతమార్చాడు. అనంతరం పారిపోయాడు. సుశీల సమాచారంతో సీఐ జానయ్య, ఎస్ఐలు కాశీంపీరా, నేతాజీ సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications