కాంగ్రెసు ఎంపి బొత్స ఝాన్సీ ఇంట్లో ఎసి చోరీ

బొత్స ఝాన్సీ నివాసంలో మంగళవారం ఈ చోరీ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దొంగతనం కేసు నమోదైంది. బొత్స ఝాన్సీ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోకసభ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ అవుట్‌డోర్ యూనిట్ దొంగతనం జరిగిందని బొత్స ఝాన్సీ పర్సనల్ అసిస్టెంట్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భవనానికి 24 గంటల భద్రత కల్పించాలని బొత్స ఝాన్సీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోరారు.
బొత్స ఝాన్సీ భర్త బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన తరుచూ ఢిల్లీకి వస్తుంటారు కూడా.












Click it and Unblock the Notifications