టాటూ ఆర్టిస్టు మృతి: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి సూసైడ్ నోట్

పరస్ భాసిన్‌తో సంబంధాన్ని తన కుటుంబం వ్యతిరేకించడం మొదలు పెట్టిన తర్వాత ఆమె ఆ సూసైడ్ నోట్‌ను తమకు అందించినట్లు వారు చెబుతున్నారు. పాండవ్ నగర్ రైల్వే ట్రాక్స్‌పై పరస్ (23) మృతదేహం శనివారం కనిపించింది. అది ఆత్మహత్య అయి ఉండవచ్చునని రైల్వే పోలీసులు అన్నారు. అయితే పరస్ తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకిస్తూ తమ కుమారుడిని హత్య చేశారని ఆరోపించారు.
పరస్ బాసిన్ గర్ల్ ఫ్రెండ్ తండ్రిని పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. సూసైడ్ నోట్‌పై పరస్ సంతకంతో పాటు అమ్మాయి సంతకం కూడా ఉంది. చేతిరాతను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు ఢిల్లీ మెట్రో సిసిటివీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. సాయంత్రం లక్ష్మినగర్ మెట్రో స్టేషన్‌లో పరస్ ఉన్నట్లు వాటి ద్వారా తెలిసింది. పరస్ సుభాష్ నగర్ మెట్రో స్టేషన్‌లో శనివారం సాయంత్రం గం.3.14 నిమిషాలకు మెట్రో రైలు ఎక్కాడు. లక్ష్మీనగర్ మెట్రో స్టేషన్‌కు సాయంత్రం గం.4.11 నిమిషాలకు చేరుకున్నాడు.
పరస్ శవాన్ని తీసుకుని వెళ్లడానికి పాండవ్ నగర్ ప్రాంతానికి రావాలని పలు సార్లు ఫోన్లు చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పరస్ మృతితో అతనికి ఏ విధమైన సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. ఆలా వెళ్తున్న వ్యక్తి పరస్ శవం దగ్గర పడి ఉన్న గుర్తింపు కార్డుతో గుర్తించి ఆ వ్యక్తి ఫోన్లు చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనను పరస్ తల్లి వ్యతిరేకిస్తోంది.












Click it and Unblock the Notifications