సిఎంతో విభేదాలు లేవన్నగల్లా: మంత్రి వరెస్స్ మంత్రి

అనంతరం గల్లా అరుణ.. రాతి ఇసుక తయారీపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా గల్లా, మరో మంత్రి బాలరాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో బాలరాజు మాట్లాడుతూ.. గిరిజనులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలపై గనుల శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలరాజు వ్యాఖ్యలకు స్పందించిన అరుణ... మంత్రులుగా ఉన్న మీరు కూడా ఇసుక మాఫియాను అడ్డుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అలా అయితే దగ్గరుండి కాపలా కాయాలని, ఫ్లైట్లలో తిరిగితే, ఎసిలలో ఉంటే సరిపోదని అన్నారు. అరుణ వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన మంత్రి బాలరాజు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications