వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త వేధింపులు భరించాలన్న జడ్జిపై ఆన్‌లైన్ ఉద్యమం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhaktavatsala
బెంగళూరు: కర్నాటక హైకోర్టు జడ్జి ఒకరు చేసిన వ్యాఖ్యలు మహిళల ఆగ్రహానికి గురి చేశాయి. భర్త వేధింపులు భరించాలని ఓ భార్యకు సూచించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా విరుచుకుపడ్డాయి. వెంటనే సదరు జడ్జిని ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో గృహ హింస, కుటుంబ వివాదాలకు సంబంధించి కేసులపై మంచి అవగాహన, శిక్షణ పొందిన న్యాయమూర్తులను భర్తీ చేయాలని మహిళా సంఘాలు, న్యాయవాదులు డిమాండ్ చేశారు.

భర్త చేతిలో చిత్రహింసలు పడలేక ఓ గృహిణి కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి భక్తవత్సలం సంసారాన్ని, పిల్లలను దృష్టిలో పెట్టుకొని భర్తతో సర్దుకు పోవాలని, అతని వేధింపులు భరించాలని సలహా ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలతో పాటు మహిళా న్యాయమూర్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ న్యాయమూర్తిని వెంటనే తొలగించాలంటూ ఆన్ లైన్ ఉద్యమాన్ని లేవదీశారు. స్త్రీలు, పిల్లలకు సంబంధించి గృహ హింస కేసుల విచారణ విషయంలో న్యాయమూర్తులకు కొన్ని మార్గదర్శకాలు సూచించాలని కోరుతూ పలువురు మహిళా న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌ను కలిసి మెమోరాండం సమర్పించారు.

నీ భర్త మంచి బిజినెస్ చేస్తున్నాడని, అతను ఫ్యామిలీ సౌకర్యాలు చూసుకుంటాడని అలాంటప్పుడు అతని వేధింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావని విడాకులు కోరిన ఓ భార్యను జడ్జి భక్తవత్సలం ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ 500 మందికి పైగా మహిళలు వెంటనే ఆన్ లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.

English summary
A Karnataka High Court Judge is under fire after he said that it was okay for a man to indulge in domestic violence and beat his wife as long as he was taking good care of his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X