కబుర్లు వద్దు: తెలంగాణపై కెసిఆర్‌కు నారాయణ సలహా

Narayana
హైదరాబాద్: తెలంగాణపై సంకేతాలు అందాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తప్పు పట్టారు. తమ తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కెసిఆర్ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు. తెలంగాణపై మళ్లీ హామీలంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

ఢిల్లీ వెళ్లిన తనకు తెలంగాణపై ఎటువంటి సంకేతాలు కూడా అందలేదని, తెలంగాణపై ఎటువంటి సంకేతాలు అందాయో కెసిఆర్ చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన అననారు. త్వరలో తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చవద్దని ఆయన కెసిఆర్‌కు సలహా ఇచ్చారు.

ఇదిలావుంటే, సెప్టెంబర్ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి నుంచి 15వ తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలను చేపడుతున్నట్లు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో తెలంగాణ సన్నాహక సదస్సులో ఆయన శనివారం పాల్గొన్నారు.

అందరి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధనే అని, అందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు కొంత మంది సీమాంధ్ర పెట్టుబడిదారులే ఆటంకంగా ఉన్నారు తప్ప ప్రజలు కాదని ఆయన అన్నారు. తెలంగాణ మార్ప్‌కు అన్ని రాజకీయ పార్టీలను కలిపుకుని రావడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. పార్టీలు, వ్యక్తులతో తమకు విభేదాలు లేవని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షను గ్రహించి వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శనివారం ప్రకటించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కోరుతామని, ప్రభుత్వం ముందుకు రాకపోతే తామే జాతీయ పతాకలను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ఉంటందని ఆయన చెప్పారు. హైదరాబాదులో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తాము జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+