అన్నదమ్ముల హత్య, బెజవాడలో ఢిల్లీ యువకుడి మృతి

మృతులు జూపూడి శ్రీనివాసరావు, రవికుమార్‌లుగా గుర్తించారు. వారిని శ్రీనివాసరావు భార్యే చంపించిందని మృతుల తల్లి ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ భార్య పద్మావతిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని గాంధీనగర్ ఉండవల్లివారివీధిలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వాంటర్‌ట్యాంక్‌పై అతడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను శనివారం ఉదయం బోయిన్‌పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications