హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నానిని టార్గెట్ చేసిన బాలయ్య: కృష్ణా జిల్లాలో మకాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిపై బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అండతో 2004, 2009లో గుడివాడ నియోజకవర్గం టిడిపి టిక్కెట్ దక్కించుకున్న కొడాలి నానికి గట్టి షాక్ ఇచ్చే యోచనలో బాలయ్య ఉన్నారని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో తన తండ్రి పుట్టిన సొంత ఊరు మాత్రమే కాకుండా గుడివాడ నుండి పోటీ చేసి గెలిచారు. దీంతో ఈ నందమూరి హీరో ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు.

అందుకే ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పార్టీలోని ఆయా జిల్లాల నేతలతో భేటీ అవుతూ, ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తూనే ఇంకో వైపు గుడివాడపై ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావును తిరిగి పార్టీలోకి రప్పించడంలో బాలకృష్ణనే కీలక పాత్ర వహించారు. 2014లో పార్టీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆయనను పార్టీలోకి రప్పించారు.

సోమవారం రావిని తన ఇంటికి రప్పించుకొని స్వయంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్దకు తోడ్కొని పోయారు. బాబుతో మాట్లాడి గుడివాడ టిక్కెట్ పైన బాబుతో కూడా హామీ ఇప్పించారని సమాచారం. అ తర్వాత అధికారికంగా బాబు సమక్షంలో రావి టిడిపిలో చేరారు. బాబు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిస్థితుల కారణంగా రావికి 2004, 2009లో టిక్కెట్ ఇవ్వలేదని వచ్చేసారి తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. రావిని రప్పించడం, బాబుతో ప్రకటన చేయించడం ఇలా బాధ్యత అంతా బాలయ్యనే తీసుకున్ననట్లుగా కనిపిస్తోంది.

గుడివాడపై ప్రత్యేక దృష్టి నేపథ్యంలో బాలయ్య త్వరలో ఆ నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరిన రావి వెంకటేశ్వర రావు త్వరలో గుడివాడ టిడిపి ఇంచార్జిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ బాధ్యతల స్వీకారోత్సవానికి బాలకృష్ణ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. అదే సమయంలో బాలకృష్ణ రెండు రోజుల పాటు ఆయన కృష్ణా జిల్లాలో మకాం వేసి పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారని తెలుస్తోంది.

English summary
Nandamuri hero and Telugudesam leader Balakrishna has decided to target Gudivada MLA Kodali Nani. Balakrishna will stay in Krishna district for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X